CM Chandrababu: ఎడ్యుకేషన్ హబ్‌లుగా విజయవాడ, విశాఖ, తిరుపతి..
- విజయవాడ.. విశాఖ.. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతాం..
- విజయవాడలో జాతీయ విద్యాదినోత్సవం వేడుకలు..
- గతంలో టీచర్లను అవమానించారు..
- బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారన్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విజయవాడ, విశాఖ, తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో జరిగిన జాతీయ విద్యాదినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో టీచర్లను అవమానించారని.. బ్రాందీ షాపుల ముందు నిలబెట్టారని విమర్శించారు. సమాజంలో విలువలు పడిపోతూ పతనావస్థకు వస్తున్నాయి. విలువలు కాపాడటానికి, నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుగారిని పెట్టాం అన్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా 164 మందిని రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం తరపున రూ. 20 వేల నగదు, షీల్డ్స్‌తో శాలువాతో సత్కరించారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ.. ఇద్దరూ విద్యా వ్యవస్థకి ఎనలేని సేవలు అందించారు. వారిని మనం గౌరవించుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులది. తల్లిదండ్రులు తరువాత గురువు ఎప్పటికీ గుర్తు ఉంటారు. నాకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ నాకు గుర్తే అన్నారు.. సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారు. ఈ రెండూ కలిసిన రోజు ఈ రోజు మీ విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారు అన్నారు.. ఒక మంచి టీచర్ ఎప్పటికి మంచి టీచరే.. అది మన ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.. ఇంగ్లీష్ అనేది బ్రతకటానికి అవసరం, అలా అని తెలుగు భాషని మర్చిపోకూడదు అని సూచించారు. రెండూ బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలికానీ, తెలుగుని తక్కువ చేసి చూడకూడదు అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!