Undavalli Arun Kumar: ఏపీ విభజన కేసు.. ఇది శుభపరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar: సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణాం అన్నారు సీనియర్ రజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజనకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అభివృద్ధి కారణంగా ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారని తెలిపారు ఉండవల్లి.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారని చెప్పారు. గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగానని, చేస్తానని చెప్పారు… కానీ, చేయలేదని ఈ సందర్భంగా వివరించారు. అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్.
Read Also: CM YS Jagan Open Challenge: చంద్రబాబు, పవన్‌కు జగన్ ఓపెన్ ఛాలెంజ్.. ఆ దమ్ముందా..?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి 9 తొమ్మిదేళ్లు గడిచింది.. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు కూడా ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా బుధవారం విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక, ఈ కేసుపై విచారణ ఎప్పుడు చేపడతారో తేదీని ప్రకటించాలని ఉండవల్లి తరపు లాయర్ విజ్ఞప్తి చేశారు. దీంతో.. ఏప్రిల్ 11కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం వెల్లడించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!