Umamaheshwari Case: పోలీసులకు చేరిన పోస్ట్ మార్టం నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Umamaheshwari Case తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం నివేదిక పోలీసులకు చేరింది. ఉస్మానియా మార్చురీ నుంచి కంఠమనేని ఉమా మహేశ్వరి పోస్టు మార్టం నివేదిక ను జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేశారు ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్యులు. ఉమా మహేశ్వరి సూసైడ్ కి పాల్పడినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు నిర్దారించారు. ఉమా మహేశ్వరి హ్యాంగ్ తనకు తాను ఉరి వేసుకుని చనిపోయినట్టు పి ఎం ఈ రిపోర్ట్.లో వుంది.
ఉమామహేశ్వరి మెడ భాగంలో త్రోట్ స్వర పేటిక బ్రేక్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1 న తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందింది స్వర్గీయ ఎన్టీఆర్ చిన్నకూతురు కంఠమనేని ఉమామహేశ్వరి. జుబ్లిహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా ఫోరెన్సిక్ సైన్స్ వైద్య బృందం పి ఎం ఈ రిపోర్ట్ ను పోలీసులకు అందజేశారు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
తన తల్లి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో తన తండ్రితో పాటు.. తన భర్త కూడా ఉన్నట్లు ఉమామహేశ్వరి కూతురు దీక్షిత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. భువనేశ్వరి మాజీ సీఎం చంద్రబాబు భార్య కాగా, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య, ఎన్టీఆర్ మరో కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరి. తన తల్లి ఆత్మహత్యపై దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఉమామహేశ్వరి ఆత్మహత్యపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది.సోమవారం మరణించిన ఉమామహేశ్వరికి బుధవారం జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తిచేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!