Ukraine Effect: వంటనూనెలపై ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు. కర్నూలు జిల్లాలో ఆయిల్ ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆదోని ,ఆత్మకూరులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. సన్‌ఫ్లవర్ అయిల్స్‌ను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల షాపులకు తాళాలు వేశారు వ్యాపారస్తులు.
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Off The Record : నంద్యాల టీడీపీలో రగులుతున్న ఆధిపత్య పోరు.. పీక్కు చేరిన వర్గ విభేదాలు.!
కడప జిల్లాలో ఆయిల్ మిల్లులు, హోల్‌సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ప్రొద్దుటూరులో వంటనూనె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనికీలు నిర్వహించారు. అసలు ధర కంటే ఎక్కువ రేటుకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లాలో అధిక ధరలకు వంట నూనెలు అమ్ముతున్న పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమలాపురంలోని హోల్‌సేల్ దుకాణాల్లోనూ వంట నూనెల నిల్వలను పరిశీలించారు. వంట నూనెల ధరలు పెంచి అమ్ముతున్నారనే ఫిర్యాదులపై దర్యాప్తు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సాకుగా చూపి, ఆయిల్ వ్యాపారస్తులు భారీగా నిల్వ చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఎవరైనా వంట నూనె ధరలు పెంచి అమ్మితే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.
తిరుపతిలోనూ వంట నూనెలు అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి..అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇకపై నిరంతరం దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు విజిలెన్స్ అధికారులు. అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లాలోని ఆయిల్ వ్యాపారుల షాపులపై విజిలెన్స్ అధికారులు రైడ్ చేపట్టారు. వంట నూనెల ధరలు ఇష్టారాజ్యంగా పెంచడంతో పాటు నిత్యావసర వస్తువులను పెద్ద స్థాయిలో నిల్వ చేసారనే సమాచారం అందుకున్నారు అధికారులు. పలుచోట్ల సోదాలు చేపట్టిన అధికారులు షాపు యజమానుల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి..రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సామాన్యులకు పెనుశాపంగా మారింది. వంట నూనెలతో పాటు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?