Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Inti Bangaram OTT: థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి ‘మా ఇంటి బంగారం’ మూవీకి విశేష ఆదరణ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధికారికంగా చేరుకుంది. ఈ సంబరాలు కొనసాగుతుండగానే చిత్రబృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించింది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2026 జూలై 17 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుందని ఆఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది. అయితే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ లలో ఇది డిజిటల్ గా రాబోతోంది. హిందీ వెర్షన్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందనున్నారు.
సమంత తన సొంత నిర్మాణ సంస్థ త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించగా, దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించిన సన్నివేశాలు సినిమాకు మంచి స్పందన తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమా ఇంకా కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే ఓటీటీ విడుదల తేదీ ప్రకటించడంతో ఈ బ్లాక్ బస్టర్ ను చూసేందుకు అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో రూ.100 కోట్ల క్లబ్లో చోటు దక్కించుకున్న ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు డిజిటల్ వేదికపై కూడా అదే స్థాయి ఆదరణను అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సమంత కెరీర్లో నటిగా, నిర్మాతగా ఈ చిత్రం ఒక కీలక మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో, జూలై 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమా ఎంతటి వ్యూయర్షిప్ నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
July 17th
Okokkodni kodathamu chudu… Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026
- Tags
- cinema
- JioHotstar
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!