Lay Foundation Stone For Steel Plant: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lay Foundation Stone For Steel Plant: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఇక, ఉదయం 11.10 – 11.30 జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిపి పాల్గొంటారు సీఎం జగన్.. అలాగే శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11.45 – 12.45 మధ్య స్టీల్ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు.
Read Also: Woman Birth to Five Children: ఏడుగురి తర్వాత.. ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జననం
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40కి పులివెందుల చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2 – 2.15 గంటల మధ్య పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగే మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు ఏపీ సీఎం.. మధ్యాహ్నం 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కాగా.. ఏడాదిలో 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరించనున్నారు.. ఇలా రెండో దిశల్లో మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!