Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 26 02 2026

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :February 26, 2026 , 9:13 pm
By Gogikar Sai Krishna
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ దారుణంగా ఉంటుంది’’.. పాక్‌కు భారత్ వార్నింగ్..

భారత్ మరోసారి ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభిస్తే ఈసారి పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, ఆ దెబ్బ తీవ్రత మరింత గట్టిగా ఉంటుందని భారత సైనిక ఉన్నతాధికారి హెచ్చరించారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వైమానిక స్థావరాలను మన క్షిపణిలు ధ్వంసం చేశాయి.

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

ఎప్‌స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?

వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు, సీఈఓగా ఉన్న బోర్జ్ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక నేరస్థుడిగా పేరున్న జెఫ్రీ ఎప్స్టీన్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అమెరికా న్యాయశాఖ వివరాల ప్రకారం.. బోర్జ్ బ్రెండే గతంలో ఎప్స్టీన్‌తో కలిసి మూడుసార్లు బిజినెస్ డిన్నర్లు (విందులు) చేశారు. అంతేకాకుండా, వీరిద్దరూ ఈమెయిల్స్, మెసేజ్‌ల ద్వారా కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. తన రాజీనామా ప్రకటనలో బ్రెండే నేరుగా ఎప్స్టీన్ పేరును ఎక్కడా చెప్పలేదు. “ఎనిమిదిన్నర ఏళ్ల ప్రయాణం తర్వాత తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది” అని మాత్రమే పేర్కొన్నారు.

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్..

విమాన ప్రయాణికులుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్ క్యాన్సలేషన్ రూల్స్‌ను సవరించింది. టికెట్ రీఫండ్, మార్పులకు సంబంధించి ఈ రూల్స్ ఎయిర్ ఫ్లైయర్స్‌కు ఎంతో ఊరటనివ్వనున్నాయి. విమాన ప్రయాణీకులు ఇప్పుడు టికెట్ బుకింగ్ చేసిన 48 గంటలలోపు అదనపు ఛార్జీలు చెల్లించకుండా వారి టిక్కెట్లను రద్దు చేసుకోవచ్చు లేదా సవరించవచ్చు. బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ఏదైనా తప్పు జరిగితే, ప్రయాణికుడు తన పేరును సరిదిద్దుకోవడానికి విమానయాన సంస్థకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సౌకర్యం విమానయాన సంస్థ వెబ్‌సైట్ నుంచి నేరుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక వేళ ప్రయాణికుడు ట్రావెట్ ఏజెంట్ లేదా మేక్‌మై ట్రిప్, ఈజీమైట్రిప్ వంటి థర్డ్ పార్టీ పోర్టల్స్ ద్వారా బుక్ చేసుకున్నా, రీఫండ్ ఇచ్చే బాధ్యత విమాన సంస్థలదే అని, ఎందుకంటే వీరు విమానయాన సంస్థ ప్రతినిధులుగా పనిచేస్తున్నారని డీజీసీఏ కొత్త రూల్స్‌లో పేర్కొంది. ఈ రీఫండ్ 14 వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయాలని చెప్పింది. ఇదే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో టికెట్ క్యాన్సలేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.

ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త మైత్రికి నాంది పలికింది. విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు మోడీకి లభించిన ఘన స్వాగతం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటిచెప్పింది. పర్యటనలో భాగంగా నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన వ్యక్తిగత విషయాన్ని ఒకటి పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. తన భార్యతో తన మొదటి డేట్ ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగిందని, ఆ భోజనం అద్భుతంగా ఉండటం వల్లే వారి బంధం బలపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి తాను, తన పిల్లలు కూడా భారత్‌కు రుణపడి ఉంటామని ఆయన అనగానే ప్రధాని మోడీ నవ్వు ఆపుకోలేకపోయారు. భారతదేశంలోని అపారమైన ప్రతిభను, ఇజ్రాయెల్‌లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని కలపడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఇద్దరు నేతలు ఆకాంక్షించారు. ప్రధానంగా కచ్చితమైన వ్యవసాయం, సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, అభివృద్ధికి సంబంధించి రెండు దేశాల మధ్య 16 కీలక అవగాహన ఒప్పందాలు (MoUలు) జరిగాయి.

హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’..16 రాష్ట్రాల్లో వేట.. 139 మంది నేరగాళ్ల అరెస్ట్.!

సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు భారీ ఆపరేషన్‌ను చేపట్టారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 139 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్న ముఠాలను పోలీసులు మట్టుబెట్టారు. అరెస్టయిన నిందితులు సుమారు 1,000 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సుమారు 127 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త తరహా మోసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

కాళేశ్వరం అద్భుతం కాదు.. అపహాస్యం

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఎనిమిదో అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారని పొంగులేటి ఆరోపించారు. “38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి, తమ రాచరికాన్ని చాటుకోవడం కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. తీరా చూస్తే ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టు పేకమేడలా కూలిపోయింది” అని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో 162 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే, అందులో 50 టీఎంసీలు తిరిగి సముద్రం పాలయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు.

లిక్కర్‌ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్‌.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు విజయవాడ రేపటిదాకా రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి రేపు మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా అవినాష్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు విజయవాడలోని కార్యాలయంలో సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తరువాత కోర్టులో హాజరు పరిచారు. ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, రెండు చోట్లా పిటిషన్లు తిరస్కరించబడటంతో అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు.

ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా లేడీ బాస్..

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ జాతీయ అధ్యక్ష పదవికి సునేత్రా పవార్ పేరును ప్రతిపాదించగా, మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సునీల్ తత్కరే దానిని బలపరిచారు. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ ఆమె నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ఏరియాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం , ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా, 27.02.2026 నుండి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని , అవసరమైన చోట మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్  జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

కొత్త చట్టం తెస్తున్నాం.. తల్లిదండ్రులను విస్మరిస్తే జీతంలో 15 శాతం కోత..

తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగినవేనని గుర్తు చేశారు. కేవలం మణులు, మాణిక్యాల కోసం ఎవరూ పోరాడలేదని, ఆత్మగౌరవం కోసమే తిరుగుబాట్లు వచ్చాయని పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • telugu news
  • Top Headlines 9pm
  • Top News

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions