APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
- ఇంజనీరింగ్‌లో 70.52 శాతం
- అగ్రికల్చర్-ఫార్మసీలో 89.59 శాతం ఉత్తీర్ణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మంత్రి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. మొత్తం 70.52 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మాత్రం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ విభాగాల్లో 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొత్తం 89.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఇక ఇంజినీరింగ్ విభాగంలో విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విభాగంలో 71.65 శాతం విద్యార్థినులు అర్హత సాధించడం విశేషంగా నిలిచింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ సేవ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు సందేశం పంపి ఫలితాలను పొందవచ్చు. ఫలితాల విడుదలతో ఉన్నత విద్యలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో వేలాది మంది విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు.
Also Read
Warm congratulations to every student who qualified in #APEAPCET2026! 🎉
🔹 Engineering: 1,82,317 qualified (70.52%)
🔹 Agriculture & Pharmacy: 63,546 qualified (89.59%)
Proud that our daughters led the way in Engineering with a 71.65% pass rate! 👏
Your success powers Andhra…— Lokesh Nara (@naralokesh) July 1, 2026
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!