లగ్జరీ కార్ల వెనకున్న బసరత్ ఖాన్ రహస్యాలు..?
హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్‌తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికారులు ఈ సోదాలు చేపట్టారు. బసరత్ ఖాన్ ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారుల చేత అరెస్టు కాగా, గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. అమెరికా, జపాన్ నుండి దిగుమతి చేసిన లగ్జరీ కార్లను దుబాయ్, శ్రీలంక మార్గం ద్వారా తెచ్చి, ఎడమ స్టీరింగ్ వాహనాలను కుడివైపు స్టీరింగ్‌గా మార్చి, తక్కువ ధరకు డిక్లేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా ప్రభుత్వానికి దాదాపు ₹25 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విచారణలో ఖాన్ అనేక వాహనాలను అండర్వాల్యూ చేసినట్లు అంగీకరించాడు. టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయిస్ కలినన్, లెక్సస్ LX-500D వంటి కార్లను తక్కువ ధరకు చూపించానని, ఎనిమిది వాహనాలపై తక్కువగా చెల్లించిన డ్యూటీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సమయం కావాలని అధికారులకు తెలిపాడు.
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.. లడఖ్ అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం..
పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను శుక్రవారం పోలీసుల అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ, రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముఖ్యంగా, అధికారులు, బీజేపీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. అందులో ఒక సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాల్చే ప్రయత్నం చేశారు. ఈ అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత, అల్లర్లను ప్రేరేపించిన కారణంగా సోనమ్ వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్‌లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్‌లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడలేదు. 2025 ఎడిషన్‌లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 1984లో ఆసియా కప్ మొదలైంది. అప్పట్లో మూడు జట్లతో మొదలైన ఆసియా కప్.. ఇప్పుడు 8 జట్లకు చేరింది. భారత్ 8 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఇన్నేళ్లలో టాప్ టీమ్‌లు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడలేదు. ఆ అవకాశం ఇపుడు వచ్చింది. భారత్ 10 సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ను ఫైనల్లో ఢీకొట్టలేదు. సెప్టెంబర్ 28న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్‌లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలో పలుచోట్ల వరదలు సంభవించి పంటలు నష్టపోయాయి. గురువారం ధరాశివ్ జిల్లాలోని భూమ్-పరంద తాలుకాలో వరద నష్టపోయిన పొలాలను అజిత్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును అజిత్ పవార్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధిత రైతులకు రుణమాఫీ చేస్తారా? అని ఓ మహిళా రైతు అడిగింది. దీనికి అజిత్ పవార్ మండిపడ్డారు. ‘‘నిన్ను సీఎంను చేయమంటావా?’’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. రైతులకు రుణమాఫీ చేయాలా? వద్దా? అనే విషయం మాకు తెలియదా? మేమేమైనా ఆటలాడడానికి ఇక్కడ ఉన్నామా? అంటూ అజిత్ పవార్ ఎదురు ప్రశ్నించారు.
బాలయ్యపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణ, కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. కైకలూరు ప్రజల కష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అని.. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కామినేనికి పట్టదు. కైకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు.. ప్రజల కష్టాల గురించి మాట్లాడటం చేతకానోడు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు.. 80 ఏళ్లు మీదపడినా కామినేనికి ఇంగితజ్ఞానం లేదు.. ఊరుపొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఈ వయసులో అసత్యాలు మాట్లాడటం భావ్యమేనా? అంటూ ఫైర్ అయ్యారు.. అర్జంట్ గా మంత్రి అయిపోవాలని కామినేని ఆరాటమని మండిపడ్డారు పేర్ని నాని..
3 ఇండస్ట్రీలు.. 3 బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ రెడీ అవుతున్నాయ్
వన్స్ ఆపాన్ ఎ టైంలో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలు కనిపించేవి. కానీ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునలకు మాత్రం సాధ్యం కాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఓ సాంగ్‌లో స్టార్స్ అలా మెరిశారంతే. ఆ తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. అప్పుడప్పుడు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి కానీ అవి చాలవంటున్నారు ఫ్యాన్స్. నాట్ ఓన్లీ టాలీవుడ్ సౌత్ మొత్తం అలానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్‌కు ఫీస్ట్ రెడీ చేస్తున్నాయి టాలీవుడ్ అండ్ కోలీవుడ్, మాలీవుడ్స్.
చర్చలు సఫలం.. ఆందోళన విరమించిన ఏయూ విద్యార్థులు..
ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది మేనేజ్‌మంట్.. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.. యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఒక రోజు ముందే నుండే హాలిడేస్ ప్రకటించారు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఖరారైంది. మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియిజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకే సునీతకు అవకాశం ఇస్తున్నట్లు గులాబీ బాస్ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో బైఎలక్షన్‌జరుగుతున్న విషయం తెలిసిందే.
గత జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న గోపినాథ్ స్థానంలో ఆయన సతీమణి సునీతకే బీఆర్ఎస్ అధినేత అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.
బాలయ్య వ్యాఖ్యలపై జోగి రమేష్ కౌంటర్ ఎటాక్..
అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కామినేని శ్రీనివాస్ ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాపరెడ్డిని ములాఖత్ లో పరామర్శించిన మాజీ మంత్రి జోగి రమేష్, గుంటూరు వైసీపీ నేత నూరి ఫాతిమా.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. అసెంబ్లీ అంటే పవిత్ర దేవాలయం.. అలాంటి అసెంబ్లీలోకి మెన్షన్ హౌస్ తీసుకొని రావచ్చా? అని ప్రశ్నించారు.. అసలు, బాలకృష్ణ నందమూరి వారసుడా..? నారావారి వారసుడా..? అని ప్రశ్నించారు.. నందమూరి వారసుడైతే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కావాలి అని సవాల్ చేశారు.. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడు కాదు అని ఎద్దేవా చేశారు.. బాలకృష్ణ.. చంద్రబాబుకి ఎప్పుడో తొత్తుగా మారాడు అని విమర్శించారు జోగి రమేష్..
ఓజీ ఫస్ట్ డే ఊహించని విధ్వంసం!
ఓజీ సినిమాను ఒక పవన్ అభిమాని ఎలా అయితే ఊహించుకున్నాడో.. అదే రేంజ్‌లో ప్యూర్ ఫ్యాన్ బాయ్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుజీత్. ఆయన పవర్ స్టార్‌కు ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకుంటోంది పవన్ ఆర్మీ. పవన్ కనిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు బాక్సులు బద్దలవుతున్నాయి. మొత్తంగా.. ఓజీ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు ఒక ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓజీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలతోనే అదరగొట్టిన ఓజీ మూవీ.. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా భారీ ఓపెనింగ్స్ అందుకుంది.
