1 దేశంలో 2.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత మూడో వేవ్‌లో జనవరి 21న దేశంలో అత్యధికంగా 3.47 లక్షల కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, కరోనా ముప్పు తొలగిపోలేదని, అప్రమత్తంగా వుండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. దేశంలో 3,35,939 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
2.తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. కొత్తగా 3590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ నుంచి రికవరీ అయినవారు 3,555. రికవరీ రేటు 94.3 శాతంగా వుంది.