Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133.
Covid-19 Variant: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో వెలుగులోకి వచ్చిన NB.1.8.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డంలో (UK) కూడా గుర్తించబడింది. ఈ వేరియంట్ కారణంగా చైనాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ఇకపోతే, శుక్రవారం ఉదయం వరకు భారత్‌లో 5,364 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.…
దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 14,917 కేసులు రాగా.. తాజాగా 8,813 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు తాజాగా 29 మంది కరోనా బారినపడి చనిపోయారు.
ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది.
దేశ రాజధానిలో కొత్తగా కొవిడ్ కేసులు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాజాగా 12 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మరో…
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద…
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,05,401గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,24,093గా నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా…
కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ,నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో నమోదవుతున్న కోవిడ్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తం అయింది. గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనుంది ఢిల్లీ…