TDP vs Jana Sena Clash: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.. అయినా.. కొన్ని సందర్భాల్లో కూటమిలోని కిందిస్థాయి నేతల మధ్య ఏదో విభేదాలు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతి నగరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read Also: Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
ఫ్లెక్సీలు కట్టే క్రమంలో మంజునాథ హోటల్ సిబ్బంది మరియు వెంకటేశ్వర పార్కింగ్ సిబ్బంది మధ్య మొదట మాటల తూటాలు మొదలయ్యాయి. అనంతరం మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డాయి. వెంకటేశ్వర పార్కింగ్ యజమాని రాజ్‌కుమార్‌పై సంపత్ రాజు, లక్ష్మీనారాయణతో పాటు మరో 20 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 41/2026 కింద ఈస్ట్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేశారు.
ఇదే ఘటనకు సంబంధించి మంజునాథ హోటల్ వర్కర్ గుత్తి లక్ష్మీనారాయణపై పార్కింగ్ సిబ్బంది 20 మంది దాడి చేశారంటూ మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 42/2026 కింద ఈస్ట్ ఎస్ఐ ఇమామ్ భాష కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘర్షణకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బస్టాండ్ ప్రాంతంలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.