Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి ముగ్గుల పోటీలు.. పాల్గొన్న అందరికీ రూ.10,116 బహుమతి..
- నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు..
- పాల్గొన్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు..
- మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు..
- బహుమతులు ప్రదానం చేసిన సీఎం దంపతులు..
- ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతీ మహిళలకు రూ.10,116 నగదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: తెలుగు లొగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. పట్టణాలకు, పని చేసే ప్రాంతాలకు టాటా చెప్పి.. సొంత ఊరికి చేరుకున్నారు ప్రజలు.. ఇక, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు.. వివిధ రంగాల ప్రముఖులు సైతం సొంత ఊరికెళ్లి.. పండగ చేసుకుంటున్నారు.. ఈ రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు.. మరోవైపు.. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి ఫ్యామిలీలో హుషారుగా పాల్గొంటున్నాయి.. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. ఇక, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి .. అంతేకాదు.. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు.. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ సహా పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
Read Also: AP Government: వారికి గుడ్‌న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
Also Read
మరోవైపు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. 15 ఈ ఆటోలు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు.. గ్రామంలో సబ్ స్టేషన్, ఏ.రంగంపేటలోని హైస్కూల్’లో కోటి రూపాయలతో డిజిటల్ క్లాస్ నిర్మాణానికి పునాదులు వేశారు.. సీఎం ఇంటి ఎదుట స్వర్గీయ నందమూరి రామారావు, బసవ తారకం విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.. ఇక, ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో పాల్గొన్న అందరూ గెలుపొందినట్టే.. విన్నర్లను డిసైడ్ చేయడం మాకు చాలా కష్టం అయ్యిందన్నారు.. అందరికీ బహుమతులు అందిస్తాం.. ఈ పండుగ మీతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది.. ఈ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు.. మరోవైపు.. భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది.. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కాదు.. ఈ పోటీల్లో 120 మంది పాల్గొన్నారు.. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఎంతో కష్టపడి ముగ్గులు పెట్టారు.. దీంతో.. ఈ పోటీల్లో పాల్గొన్నవారందరికీ ప్రతీ మహిళలకు సాయం చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు.. వాళ్ల ఇళ్లకు రూ.10,116 పంపిస్తానని ప్రకటించారు.. డబ్బులతో వెల కట్టాలని కాదు.. వాళ్లను చూసి నాకు చాలా సంతోషం కలిగి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. అందరూ సంతోషంగా బతకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు నారా భువనేశ్వరి..
నారావారిపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించిన సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/OUeMlmuHYI
— Telugu Desam Party (@JaiTDP) January 13, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!