నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి ఫ్యామిలీలో హుషారుగా పాల్గొంటున్నాయి.. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.. ఇక, మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి .. అంతేకాదు.. గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు సీఎం దంపతులు.. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ సహా పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తాను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతోంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ…