AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో సర్పంచి పదవుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆరు ప్రధాన పంచాయతీల్లో సర్పంచి పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, పదవుల కోసం వేలం జరుగుతోందంటూ ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రేణిగుంట సర్పంచి పదవికి ఏకంగా రూ.1.5 కోట్లు ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది.
మిగిలిన పంచాయతీల్లోనూ సర్పంచి పదవులకు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ ఉన్నట్లు సమాచారం. కూటమి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు పంచాయతీ అభివృద్ధి పనుల్లో వాటాలు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారికి కాకుండా, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, రేణిగుంట పరిధిలోని పలు పంచాయతీలకు సంబంధించిన ఏకగ్రీవాల జాబితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచి పదవుల కోసం భారీ మొత్తాల్లో నగదు చేతులు మారుతోందన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పదవుల వేలం, నగదు ఆఫర్లకు సంబంధించిన ప్రచారంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
Also Read
- EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
- AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
తాజావార్తలు
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
-
CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!