AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC and ZPTC Elections: చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు, నిరసనలు చోటుచేసుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున ముందస్తు అరెస్టులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని కపిలేశ్వరస్వామి స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణకు దిగిన వెంకటపతి నగర్‌కు చెందిన బొర్రెడ్డివారి గజేంద్రనాథ్ రెడ్డి, కోనేరు ప్రసాద్ రెడ్డిలను తిరుపతి రూరల్ పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయి నగర్ పంచాయతీ లిటిల్ ఏంజెల్స్ స్కూల్ సెంటర్ వద్ద ఓటర్లతో గొడవపడుతూ ఉద్రిక్తత సృష్టిస్తున్న శశిధర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు చంద్రగిరి మండలం అగరాల గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల నడుమ వివాదం నెలకొంది. ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు తుకాకుల దేవరాజుల రెడ్డిని చంద్రగిరి పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.ఇక చంద్రగిరి టవర్ క్లాక్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, మల్లం చంద్రమౌళి రెడ్డి సహా తొమ్మిది మంది నాయకులు ఆందోళన చేపట్టారు. కోటాల, నరసింగాపురం, అగరాల, ఐతేపల్లి, రామిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు వారిపై సీఆర్ నంబర్ 289/2026 కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఆర్సీపురం మండలం కాలేపల్లి గ్రామంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే విషయమై తీవ్ర ఘర్షణ చేలరేగింది. సురవారిపల్లెకు చెందిన పి. వాసుదేవ రెడ్డి ప్రయాణిస్తున్న స్కోర్పియో వాహనాన్ని అడ్డుకుని, ఆయనను బయటకు లాగి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసమై సుమారు 30 వేల రూపాయల నష్టం వాటిల్లగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్. యశ్వంత్, ఎమ్. ధనంజయ రెడ్డి సహా 12 మందిపై ఆర్సీపురం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఎర్రవారిపాలెం జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు దిగుతున్న పి. హేమంత్ కిషోర్ రెడ్డి, సి. గంగిరెడ్డి, వై. వెంకటరెడ్డి, పి. శివప్రసాద్‌లను వై.వి.పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. మొత్తంగా తిరుపతి రూరల్, చంద్రగిరి, ఆర్సీపురం, వై.వి.పాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల ఘర్షణలు, నిరసనలపై 6 కేసులు నమోదు చేసి, 29 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
Also Read
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
తాజావార్తలు
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!