డ్రోన్లను వినియోగించాలంటే డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు అన్నారు. ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి. భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు. విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ను వినియోగించరాదు. జనసమూహాలుండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనంతో ఉన్న స్టేడియంలలో డ్రోన్ లు వినియోగించరాదు. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలపై, నో-డ్రోన్ సమీపంలో డ్రోన్ ను ఎగురవేయరాదు అని తెలిపారు.
read more : ఆవుల దొంగతనం కోసం విమానంలో…?
ఇక ప్రైవేట్ ఆస్తుల సమీపంలో వారి అనుమతి లేకుండా చిత్రీకరించకూడదు AAI/ADC 24 గంటల ముందు దాఖలు చేయకుండా విమానాశ్రయాల సమీపంలో నియంత్రిత ఆకాశ మార్గంలో డ్రోన్ ను ఎగురవేయరాదు. ప్రమాదకరమైన పదార్థాలను తీసుకెళ్లకూడదు లేదా కింద పడవేయకూడదు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి డ్రోన్ వినియోగించకూడదు. కదిలే వాహనాల నుండి డ్రోన్ ను ఎగరవేయకూడదు అని పేర్కొన్నారు.