Drone: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం సాహా గ్రామంలోని పంట పొలాలపై ఆదివారం విమానం ఆకారంలో డ్రోన్ పడి ఉండటం కలకలం రేపింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో మేకలను మేపుతున్న మేకల కాపరికి విమాన ఆకారంలో వున్న డ్రోన్ కంటపడింది.
భారత్-పాక్ సరహిద్దులతో మొదట కలలం సృష్టించిన డ్రోన్లు.. ఆ తర్వాత జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడికే ఉపయోగించారు.. ఇక, అప్పటి నుంచి ఎక్కడ డ్రోన్లు కదలినా.. అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇవాళ ఎర్రకోట సమీపంలో డ్రోన్ ఎగరడంతో కలకలమే రేగింది.. వెంటనే ఆ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా డ్రోన్ ఎగిరింది.. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చినా.. డ్రోన్‌కు మాత్రం అనుమతి లేదు..…
డ్రోన్లను వినియోగించాలంటే డిజిటల్ స్కై ప్లాట్ ఫామ్ ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలి అని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు అన్నారు. ఫ్లైయింగ్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలి. భూమట్టం నుండి 400 అడుగుల (120 మీ) కంటే ఎక్కువ డ్రోన్లను ఎగురవేయరాదు. విమానాశ్రయాలు, హెలిప్యాడ్ ల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ ను వినియోగించరాదు. జనసమూహాలుండే ప్రదేశాలు, బహిరంగ కార్యక్రమాలు, జనంతో ఉన్న స్టేడియంలలో డ్రోన్ లు వినియోగించరాదు. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక…