Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా బట్టబయలు
- గోవిందరాజస్వామి ఆలయ ఉద్యోగి అరెస్ట్
- రూ.3 లక్షల విలువైన మెత్ స్వాధీనం
- బయో చెక్ టెస్టులతో పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Drugs Case : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇటీవల వెలుగుచూసిన ఒక అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా కేసులో రేణిగుంట పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఒకరు ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి కావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు తిరుపతిలోని ప్రముఖ గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. పవిత్రమైన సంస్థలో పనిచేస్తూ ఇలాంటి అక్రమ దందాకు తెరలేపడంపై భక్తులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రూ. 3 లక్షల విలువైన ‘మెత్’ స్వాధీనం
ఈనెల 10వ తేదీన రేణిగుంట పోలీసులు నిక్కచ్చిగా దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మార్కెట్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే 63 గ్రాముల బరువు గల అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్ ‘మెత్’ (మెథాంఫెటమైన్) ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఈ టీటీడీ జూనియర్ అసిస్టెంట్‌తో పాటు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. చదువుకోవాల్సిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకుని, వారికి ఈ ముఠా క్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఉద్యోగుల్లో గుబులు.. పోలీసుల ‘బయో చెక్’ ముమ్మరం
ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్‌ను అరెస్ట్ చేయడంతో అతనితో సన్నిహితంగా మెలిగిన ఇతర ఉద్యోగుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడి నుండి ఈ డ్రగ్స్ తిరుపతికి వస్తున్నాయి? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా, నగరంలో డ్రగ్స్, గంజాయి సంస్కృతిని పూర్తిగా అణచివేయడానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా ‘బయో చెక్ టెస్టులు’ (Bio Check Tests) నిర్వహిస్తూ.. ఎవరెవరు వీటికి బానిసలయ్యారో వారి గుట్టును రట్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!