Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపఖండం నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్తే వానాకాలం ముగిసినట్టే లెక్క. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు విస్తారంగా వర్షాలు కురిపించింది. మలికిపురంలో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఈ నెల 19 నాటికి పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కానుందని ఐఎంజీ ప్రకటించింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న రుతుపవన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అంచనాల కంటే ఆలస్యంగా జూన్ 4న కేరళలోకి ప్రవేశించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలై నాటికి దేశమంతా విస్తరించినా చినుకులు పడలేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో మొదటి మూడు నెలలు తీవ్ర ఎండలు, చెదురుమదురు జల్లులకే పరిమితమయ్యాయి. మంచి వర్షపాతం అందించాల్సిన అల్పపీడనాలు, వాయుగుండాలు అన్నీ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తరలిపోవడంతో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. ప్రస్తుతం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
- Tags
- andhrapradesh
- IMD
- Monsoon
- weather
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!