కలియుగ వైకుంఠం తిరుమల రథ సప్తమి వేడుకలకు సిద్ధమయింది. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.రథ సప్తమి నాడు ఏటా భక్తులతో తిరుమల సందడిగా వుంటుంది. అయితే తాజా పరిస్థితుల్లో భక్తులకు తిరుమల వెళ్ళి స్వయంగా వేడుకలను చూసే అవకాశం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సప్త వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.