TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తహతహలాడుతుంటారు.. కొందరు ప్రతీ వారం, ప్రతీ నెల.. ప్రతీ ఏడాది.. అని మరి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకుంటే.. చాలా మంది తమ వీలునుబట్టి తిరుమలకు వెళ్తుంటారు.. అయితే, స్కూళ్లకు సెలవులు రావడంతో.. చాలా కుటుంబాలు శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాయి.. ఎప్పుడూ భక్తుల తాకిడి ఉండే తిరుమల కొండలు.. బ్రహ్మోత్సవాలు, ఏవైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు రద్దీగా మారిపోతుంటాయి.. ఇక, హాలీడేస్ సమయంలో భక్తులతో తిరుమల కిక్కిరిసిపోతోంది.. అయితే, ఇవాళ టీటీడీ విడుదల చేసిన శ్రీవారికి సంబంధించిన వివిధ సేవలు, దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తి అయ్యాయి..
Read Also: Rajat Patidar: హోంగ్రౌండ్ ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదు!
శ్రీవారి దర్శన టిక్కెట్లుకు డిమాండ్ కొనసాగుతుంది.. జులై నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ.. ఆర్జిత సేవా టిక్కెట్లును గంటా నాలుగు నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు.. ఇక, అంగప్రదక్షణ టికెట్లను 2 నిమిషాలలో వ్యవధిలో బుక్ చేసుకున్నారు.. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు 9 నిమిషాల వ్యవధిలోనే పూర్తి కాగా.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా కేవలం 58 నిముషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేశారు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు..