TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ప్రతి నిత్యం తిరుమల గిరులు భక్తులతో రద్దీగా ఉంటాయి.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.. అయితే, ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు భక్తులు.. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించిన పలు సేవల టికెట్లను ఆన్లైన్లో విక్రయించిన టీటీడీ.. ఇప్పుడు భక్తుల నుంచి ఫుల్ డిమాండ్ ఉండే.. ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఆన్లైన్లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనుంది.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో పెట్టనున్నారు టీటీడీ అధికారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల చేయనున్నారు..
Read Also: SSMB29 : SSMB29 నుంచి సౌండ్ మొదలైంది – కాలభైరవ రివీల్ చేసిన ఆసక్తికర అప్డేట్!
మరోవైపు, ఇవాళ నాగుల చవితి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేవారు.. ఈ రోజు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహించనున్నారు.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూ కాంపెక్స్లోని 20 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.. అయితే, నిన్న శ్రీవారిని 71,110 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 25,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..