TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- నేడు డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల..
- ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల.. వయోవృద్ధులు.. వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటా విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు..
Read Also: Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం అదే: పంత్
Also Read
మరోవైపు.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, రేపు మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుద చేయనున్నారు.. ఇక, శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం ప్రారంభమైంది.. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగాని ప్రారంభించామని ఈవో ఇఓ శ్యామలరావు వెల్లడించారు.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి యాగాని నిర్వహిస్తాం.. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ పండితులు ఆధ్వర్యంలో యాగాని నిర్వహిస్తున్నాం అన్నారు.. చివరగా అన్నప్రసాద పోటులో.. లడ్డూ ప్రసాద పోటులో సంప్రోక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీతగ్గింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 82,436 మంది భక్తులు దర్శించుకోగా.. 25,437 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.4.57 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
తాజావార్తలు
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!