Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న అరవింద్ కేజ్రీవాల్..
- దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ రావాలని పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు.
కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీకి ఓటు వేయని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించి, నకిలీ ఓట్లను చేర్చుతున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ హయాంలో ఈ వ్యవహారం జరుగుతోందని విమర్శించారు. దేశ ప్రజలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
ఇదిలా ఉంటే, మరోవైపు నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే సీజేపీ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు మెట్రో రైల్ స్టేషన్లు మూసేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉందని పోలీసులు తె లిపారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు