Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
- స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది
- 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Skoda Slavia Facelift Launched in India: ప్రముఖ చెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026ను భారత్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త మోడల్లో డిజైన్ మార్పులతో పాటు అధునాతన ఫీచర్లు, మెరుగైన ఏసీ వ్యవస్థ, 360-డిగ్రీ కెమెరా, కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి కీలక అప్డేట్లు ఉన్నాయి. స్లావియా ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే కొత్త స్లావియా ధరలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.
కొత్త డిజైన్‌తో స్లావియా
ఫేస్‌లిఫ్ట్ అయినప్పటికీ కారు మొత్తం సిల్హౌట్లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ముందు, వెనుక భాగాల్లో పలు డిజైన్ అప్డేట్లు చేశారు. కొత్త స్లావియాలో రీడిజైన్ చేసిన హెడ్లైట్లు, టెయిల్లైట్లు, ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ డామ్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్కోడా కుషాక్ డిజైన్‌ను పోలి ఉండేలా గ్రిల్‌లోనే సెగ్మెంటెడ్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs)ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు అందించారు. దీంతో కొత్త స్లావియాకు మరింత ప్రీమియం లుక్ లభించింది.
Also Read
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
- Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
కొత్త కలర్ ఆప్షన్లు
స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా ఆర్కిటిక్ సిల్వర్, కాపుచినో బేజ్ రంగులను పరిచయం చేశారు. వీటితో పాటు షిమ్లా గ్రీన్, బ్రిలియంట్ సిల్వర్, క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, స్టీల్ గ్రే, లావా బ్లూ, చెర్రీ రెడ్, డీప్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్లలో వెనుక సీట్ల మసాజింగ్ ఫంక్షన్ ఒకటి. ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్న తొలి కార్లలో స్లావియా ఫేస్‌లిఫ్ట్ నిలిచింది. దీంతో సుదీర్ఘ ప్రయాణాల్లో వెనుక ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది.
పెద్ద డిస్ప్లేలు
ఇంటీరియర్‌లో కూడా కీలకమైన అప్డేట్లు చేశారు. పాత 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ స్థానంలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ను అందించారు. అలాగే పాత 8-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే స్థానంలో 10.25-అంగుళాల డ్రైవర్ డిస్ప్లే వచ్చింది. అయితే పనోరమిక్ సన్‌రూఫ్ మాత్రం కొత్త స్లావియాలో అందుబాటులో లేదు. సింగిల్-పేన్ సన్రూఫ్నే కొనసాగించారు.
360-డిగ్రీ కెమెరా
పాత రియర్-వ్యూ కెమెరా స్థానంలో ఇప్పుడు 360-డిగ్రీ కెమెరాను అందించారు. పార్కింగ్, ఇరుకైన ప్రదేశాల్లో కారు నడపడం వంటి సందర్భాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే కుషాక్‌లో మాదిరిగానే మెరుగైన ఏసీ పనితీరు కోసం కొత్త స్లావియాలో వేరియబుల్-డిస్ప్లేస్మెంట్ కంప్రెసర్ ను ఉపయోగించారు. అయితే ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
అదే ఇంజిన్ ఆప్షన్లు
2026 స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్ ఆప్షన్లలో పెద్ద మార్పు లేదు. ఇందులో 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ – 115hp, 1.5-లీటర్ TSI టర్బో పెట్రోల్ – 150hp ఇంజిన్ ఆప్షన్లు కొనసాగనున్నాయి. 1.0-లీటర్ TSI ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది. 1.5-లీటర్ TSI ఇంజన్‌తో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.
1.0 TSI ఆటోమేటిక్‌లో కీలక మార్పు
కొత్త స్లావియాలో ప్రధానమైన మెకానికల్ అప్డేట్ 1.0-లీటర్ TSI ఆటోమేటిక్ వేరియంట్లో వచ్చింది. గతంలో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో ఇప్పుడు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇది డ్రైవింగ్‌ను మరింత స్మూత్‌గా, సౌకర్యవంతంగా మార్చే అవకాశం ఉంది.
వెర్నా, హోండా సిటీకి పోటీ
కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మిడ్-సైజ్ సెడాన్లతో పోటీపడుతుంది. కొత్త డిజైన్, పెద్ద డిస్ప్లేలు, 360-డిగ్రీ కెమెరా, వెనుక సీట్ల మసాజింగ్ ఫంక్షన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి అప్డేట్లతో స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఈ సెగ్మెంట్లో మరింత పోటీగా మారే అవకాశం ఉంది. ధరల విషయానికి వస్తే, స్కోడా త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో పండుగ సీజన్లో కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..