విద్యుత్ బకాయిలపై తెలుగు రాష్ర్టాలకు మోడీ సర్కార్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ బకాయిల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేలా కృషి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఏడాది జూలై 14న తమకు లేఖ రాసినట్లు చెప్పారు.
విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. మొదట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పొందిన విద్యుత్‌కు తెలంగాణ చెల్లింపులు చేశామని తెలిపింది . విద్యుత్ చార్జీలకు సంబంధించి తెలంగాణ బకాయిపడ్డ సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదు. అసలుపై విధించిన వడ్డీ విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైందని మంత్రి తెలిపారు. ఈ వడ్డీ చెల్లింపుపై పవర్ పర్చేజ్ ఒప్పందంలోని షరతులకు లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సామరస్యంగా రాజీ కుదుర్చోకోవాలని మంత్రి వెల్లడించారు. విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ఉభయ రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!