విద్యుత్ బకాయిల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని…