బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చైన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దీంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వర్షంపడి రోడ్లు జారే అవకాశం ఉంటుంది. వాహనాదారులు నెమ్మదిగా వెళ్లాలి. విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వా లి. కానీ స్వతహాగా రిపేర్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. బావుల వద్ద సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. పురాతన ఇళ్లలో ఉన్నవారు వాటిని ఖాళీ చేసి వెళ్లాలి, చిన్నపిల్లలు, వృద్ధులు చలిగాలులకు వర్షాల కారణంగా అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. కావున వారిని బయటికి వెళ్లనీయకుండా చూడాలి. ఇళ్లలో బట్టలు ఆరేసే దగ్గర విద్యుత్ తీగలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనలను పాటించాలి.