పార్లమెంట్ లో కొందరు నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.? నోరు అదుపుతప్పుతున్న వారిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు బీజేపీ నేత టీజీ వెంకటేష్ (TG Venaktesh) . భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై (Draupadi murmu) అధీర్ రంజన్ చౌదరి చెప్పరాని భాషలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలన్నారు. ఇది అవివేకమైన చర్య….పార్లమెంట్ లో నిబంధనలు మార్చాలి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, జైలులో పెట్టాలన్నారు వెంకటేష్. రాయలసీమ హక్కులపై మాట్లాడుతూనే ఉన్నాం అన్నారు.
Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
తమిళనాడులో ఉన్నప్పటి నుంచి కర్నూలుకు, కర్నూల్ నుంచి హైదరాబాద్ కు రాజధాని మార్చారు. ప్రతిసారి రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తామన్నారు…హైకోర్టు మార్పు రాష్ట్రప్రభుత్వంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెప్పింది. హైకోర్టుపై రాష్ట్రం కంటి తుడుపుగా ప్రకటనలు చేస్తున్నారు., రాయలసీమకు సాగునీటి కోసం సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ యాత్ర చేపడుతోంది. పోలవరంపై లెక్కలు చూపితే డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్తున్నా ఇవ్వడం లేదు. పోలవరం పై ఏపీ ప్రభుత్వం చెబుతున్నవి కాకిలెక్కలు అని విమర్శించారు టీజీ వెంకటేష్.
Munugodu Politics : రాజగోపాల్ రెడ్డి స్థానంలో వెంకట్ రెడ్డి బరిలోకి?