Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Telugu States Cms Meeting In Delhi Over Banakacherla Project

Telugu CMs Meeting: ఢిల్లీకి చేరిన నీళ్ల పంచాయతీ.. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!

Published Date :July 16, 2025 , 2:11 pm
By Chandra Shekhar Pamena
  • కాసేపట్లో ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..
  • కృష్ణా, గోదావరి బేసిన్లలో పెండింగ్‌లోని అన్ని అంశాలపై చర్చ..
  • గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని పక్కన పెట్టాలని తెలంగాణ వెల్లడి..
  • గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉంది: చంద్రబాబు
Telugu CMs Meeting: ఢిల్లీకి చేరిన నీళ్ల పంచాయతీ.. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశ ఎజెండాలో గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశం పక్కన పెట్టాలని నిన్న ( జూలై 15న) జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు.

Read Also: YS Jagan: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి.. సెన్సార్ వాళ్లకు చెప్పండి!

అయితే, నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 టీఎంసీల మిగులు నీరు ఉంటుందన్నారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Banakacherla Project
  • chandrababu
  • Delhi
  • revanth reddy

తాజావార్తలు

  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం..

  • New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..

  • MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..

  • Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్ మిషన్’’ అంతం చేస్తా..

  • Simhachalam: రేపే సింహాచల చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం.!

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions