ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న టీడీపీ మహానాడు వేదిక మారినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తొలుత ఒంగోలు శివారులోని త్రోవగుంట బృందావన్ గార్డెన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ భావించింది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతంలో నీళ్లు నిలిచి బురదమయంగా తయారైంది. మరోసారి వర్షం పడితే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మహానాడు వేదికగా మార్చినట్లు టీడీపీ నేతలు వివరించారు. Minister Peddireddy:…