కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 2 లక్షలు …15న చెక్కుల పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మార్చి నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 7 నెలల కాలంలో ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు చెక్కుల పంపిణీ జరుగుతుంది. కరోనా 2వ విడతలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 63 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించి ఆయా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. మార్చిలో ఆర్థిక సహాయం అందించిన వారిలో కరోనా మహమ్మారితో మరణించిన మూడు జర్నలిస్టుల కుటుంబాలకు అదనంగా మరో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అదే రోజు అందించడం జరుగుతుంది. అనారోగ్యం బారిన పడి పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు 50 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తారు. మొత్తం 101 మంది లబ్ది చేకూరుస్తూ ఒక కోటి 62 లక్షల రూపాయల పంపిణీ జరుగుతుందని అల్లం నారాయణ తెలిపారు. ఈ కుటుంబాలకు అయిదేళ్లపాటు రూ.3000/-ల చొప్పున పెన్షన్ కూడా అందిస్తామని ఆయన తెలిపారు.
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
కరోనా విపత్కర సమయంలో వారియర్స్ గా పని చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతోపాటు జర్నలిస్టులు కూడా వార్తా సేకరణలో గడ్డు పరిస్థితులలో పని చేశారు. అందువల్లనే జర్నలిస్టులు కూడా విరివిగా కరోనా బారిన పడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరఫున కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటోంది.
ఇప్పటి వరకు మొత్తం 3909 మందిలో తొలి విడతగా 1553 మందికి 20 వేల చొప్పున, హోంక్వారంటైన్ లో ఉన్న 87 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామని అల్లం నారాయణ చెప్పారు. రెండవ విడతలో 2269 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశాం. జర్నలిస్టులకు కరోనా సాయంగా మొత్తం 5 కోట్ల 56 లక్షల రూపాయలు మీడియా అకాడమి నుండి జర్నలిస్టుల ఖాతాలకు పంపిణీ చేసి ఆర్థిక సహాయం ద్వారా ఆదుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ భవనంలోని 2వ అంతస్తులోని మీడియా అకాడమీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేస్తారు. కరోనాతో మరణించిన 63 మందికి, ఇతర కారణాలతో మరణించిన 34 మందికి, అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు డిసెంబర్, 15వ తేదీన బుధవారంనాడు హైదరాబాద్ కు వచ్చి చెక్కులు తీసుకోవాలని కోరారు. మొత్తం 101 మంది లబ్దిదారులకు ఒక కోటి 62 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తామని అల్లం నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..