తన ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఓ రైతు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మామిడి, లిచ్చి, అరటితో పాటు కూరగాయలను రైతులు పెద్దఎత్తున సాగు చేస్తారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలను రాజధాని పాట్నాకు సరఫరా చేస్తారు.
నవమాసాలు మోసి కన్న బిడ్డను తమ అవసరాలకు అమ్మేస్తున్న ఘటనలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. పసిబిడ్డ విక్రయ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్చి 3 వ తేదీన ప్రసవించిన పసిబిడ్డను విక్రయించాడో తండ్రి. ఏపీ కి చెందిన చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి ప్రసవించిన మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్,అత్త…
కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మార్చి నుండి…