చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..!

ముఖ్యమంత్రి అయ్యేవరకూ అసెంబ్లీకి రాను అంటూ శాసనసభ నుండి వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కుప్పం ఓటమిని డైవర్ట్ చేయడం కోసమే అయన అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు.. వ్యక్తిత్వం ఇప్పటికే దిగజార్చుకున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని సూచించిన ఆయన.. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సభలో మాట్లాడి వివరిస్తారని తెలిపారు.. భౌతికంగా లేకుండా చేస్తాను అనడం దారుణం.. చంద్రబాబు శృతిమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు శ్రీకాంత్‌రెడ్డి.

Read Also: టీఆర్ఎస్‌కు గట్టు రాజీనామా.. మీ అభిమానం పొందలేకపోయా..!

భారీ వర్షాలపై సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేశారని తెలిపిన శ్రీకాంత్‌ రెడ్డి.. ముందస్తుగా ఎప్పటికప్పుడు సీఎం ఆదేశాలు ఇచ్చారని.. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు రేయింబవళ్లు పని చేస్తున్నారని వెల్లడించారు.. దురదృష్టవశాత్తు అధికంగా వరద రావడంతో నష్టం జరిగిందని.. ప్రజలకు అన్ని రకాల సహాయ, పునరావాస కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇంతగా స్పందించి చేస్తున్నా బురదజల్లేందుకే చంద్రబాబు పర్యటన చేస్తున్నాడని మండిపడ్డ ఆయన.. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం చంద్రబాబుకి అలవాటు.. అక్కడి సహాయక చర్యలకు ఆటంకం ఉండకూడదు అని భావించి సీఎం వెళ్లలేదని.. ప్రజల్ని ఓదార్చాల్సిన సమయంలో చంద్రబాబు తనను ఓదార్చాలని కోరుకుంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ సొంతగా ఒక్కో బాధిత కుటుంబానికి 30వేలు ఇచ్చారు.. చెవిరెడ్డి చెరువు కట్టపై నిద్రిస్తూ ప్రజలకు తోడున్నారు.. కానీ, చంద్రబాబు నేను ఒకర్ని గాల్లో కలిపేసాను.. మరొకరిని లేకుండా చేస్తాను అంటున్నాడని మండిపడ్డారు.. ఒక ప్రతిపక్ష నేత ఒక ముఖ్యమంత్రిని అలా మాట్లాడొచ్చా..? అని నిలదీసిన ఆయన.. నాకింద పనిచేయాల్సి వస్తుంది అని చంద్రబాబు పోలీసులను బెదిరిస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం కుటుంబ సభ్యులను కూడా వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది.. జరగని దానికి సానుభూతి కోరుకునే నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలే నీ నైజానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యానించారు శ్రీకాంత్‌రెడ్డి.

Related Articles

Latest Articles