ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే ప్రజలకు మంచిదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటర్ ఇచ్చారు. ‘సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం- మంత్రి బొత్స. మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండక్కర్లేదా వైఎస్ జగన్ గారూ. అవి కూడా తగ్గించండి- ప్రజలు’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
సినిమా అందరికి అందుబాటులో ఉండాలి. అందుకే ధరలు తగ్గించాం – మంత్రి బొత్స.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) December 23, 2021
మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండకర్లేదా @ysjagan గారు..అవి కూడా తగ్గించండి.@ప్రజలు.#గోరంట్ల#ReduceBasicCommoditiesPriceInAp
Read Also: హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్
అంతకుముందు శ్యామ్‌సింగరాయ్ మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని.. టిక్కెట్లు రేట్లు తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారని హీరో నాని వ్యాఖ్యానించాడు. దీంతో హీరో నానికి మంత్రులు బొత్స, కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. టిక్కెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడం ఎలా అవుతుందని హీరో నానిని మంత్రి కన్నబాబు సూటిగా నిలదీశారు.