గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ నుండి వర్ల రామయ్య, అశోక్ బాబు ఇతర నేతలు గవర్నర్ ను కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు బయటకొస్తే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. విశాఖ, రామతీర్థం ,తిరుపతి ఎయిర్ పోర్టు.. ఎక్కడికి వెళ్లినా ఆటంకాలు సృష్టిస్తున్నారని జడ్ ప్లస్ భద్రత లో ఉన్న చంద్రబాబుకు కనీస భద్రత కల్పించలేదని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి.. మంత్రా..? ఇంట్లో అంట్లు తోముకునే వ్యక్తా..? రాళ్ళ దాడిని డ్రామా అని అంటున్నారని అన్నారు. ద్దిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, మంత్రులు బజారు మనుషుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు భద్రతపై ఇప్పటివరకు రివ్యూ చేయలేదని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరుపతి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులతో న్యాయం జరగదన్న ఆయన రాళ్ళ దాడి జరగలేదని డిఐజికి ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ దాడి జరగలేదని మంత్రి పెద్దిరెడ్డి ఎలా చెబుతారు..? వివేకానంద రెడ్డి హత్య కేసు తేల్చలేక పోయారు, రాళ్ళ దాడి ఘటనపై ఏమీ చేతకాకపోతే ఉద్యోగాలకి రాజీనామా చేయడం మంచిదని అన్నారు. సీఎం సెక్రటేరియట్ కి వెళితే.. ఇనుప కంచెలు ,తెరలు ఎందుకు అడ్డుపెడుతున్నారు..? డీజీపీ పూర్తిగా విఫలమయ్యారు అని ఆయన అన్నారు. కేంద్ర బలగాలు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.