టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం సంచలన వీడియో విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందన్న పట్టాభి ..వీడియో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు పట్టాభి. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు పట్టాభి. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు…