Business Headlines 19-07-22: పీఎస్‌యూల్లో పెరిగిన విదేశీ పెట్టుబడులు
ఫారన్ ఫండ్ మేనేజర్లకు మన ప్రభుత్వ రంగ సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే ఇండియన్ ఈక్విటీల్లోని 2 లక్షల 27 వేల కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. అయిప్పటికీ అదే సమయంలో 30 ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగటం విశేషం. మొత్తం 50 లిస్టెడ్ పీఎస్‌యూల్లో 30 పీఎస్‌యూలు ఎఫ్‌పీఐల్లో వృద్ధి సాధించటం చెప్పుకోదగ్గ విషయం.
తొలిసారి 80 మార్క్ దాటిన రూపాయి
రూపాయి మారకం విలువ తొలిసారి 80 మార్క్ దాటింది. అమెరికా డాలర్‌తో పోల్చితే ఏడాది వ్యవధిలో సుమారు 7 శాతం పతనమైంది. నిన్న సోమవారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసేటప్పటికి 79 పాయింట్ తొమ్మిదీ ఏడు పలికిన దేశీయ కరెన్సీ మారకం విలువ ఇవాళ మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన మొదట్లో 80 పాయింట్ ఒకటీ ఏడుకి క్షీణించింది.
ఇండస్ ఇండ్ 20 వేల కోట్ల ఫండ్ రైజింగ్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 20 వేల కోట్ల రూపాయల వరకు ఫండ్ రైజింగ్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతించినట్లు సోమవారం వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఈక్విటెన్స్‌ని జారీ చేయటం ద్వారా ఈ నిధులను సేకరించనుంది.
read more: Rupee hits 80 mark: రూ’పాయే’.. డాలర్‌తో రికార్డు కనిష్టానికి..!
30 శాతం తగ్గిన రష్యా చమురు దిగుమతి
రష్యా నుంచి ఇండియా, చైనాలకు క్రూడాయిల్ దిగుమతి దాదాపు 30 శాతం తగ్గింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యాక ఆసియా దేశాలు చమురు కోసం రష్యా పైన ఆధారపడటాన్ని మానుకున్నాయి. ఒకానొక దశలో ఇండియా చుక్క చమురును కూడా తీసుకోని రోజులున్నాయి. అయితే యుద్ధ వాతావరణంలో కాస్త సడలింపు రావటంతో మన దేశం గత నెలలో ఓ రోజు రష్యా నుంచి పది లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ని దిగుమతి చేసుకుంది.
జూన్‌లో తగ్గిన రిటైల్ అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలలతో పోల్చితే మూడో నెలలో రిటైల్ సేల్స్ వృద్ధి రేటు మందగించింది. 2019 జూన్ కన్నా ఈ ఏడాది జూన్‌లో చిల్లర అమ్మకాలు 13 శాతం పెరిగినప్పటికీ రానున్న పండగ సీజన్‌లో తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. నిత్యవసరాల ధరలు పెరగటంతో వినియోగదారులు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రభావం వచ్చే నెలల్లోనూ కొనసాగొచ్చని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.