విజయనగరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పై మండిపడ్డారు. బొత్సా వ్యాఖ్యల మీద స్పందిస్తే నా మీద ఎంపీ బెల్లాన స్పందించారు. ఆర్.ఈ.సి.ఎస్ లో అవినీతి జరిగిందని ఎంపీ బహిరంగంగా ఆరోపించారు. మరుసటి రోజు విజయవాడ వెళ్లి వచ్చిన తరవాత తమ వ్యాఖ్యల్లో మార్పు కనపడింది.
వైసీపీ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు బొత్సా చేసిన అభివృద్ధి ఏంటి. తన పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు. మాజీమంత్రి కిమిడి మృణాళిని అవినీతి చేశామంటున్నారు. అవినీతి చేసినట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. టీడీపీ హయాంలో రాజాంలో అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. ఎలాంటి అభివృద్ధి చేశామో ఒక్క సారి వెళ్లి చూస్తే తెలుస్తుంది. గత టీడీపీ హయాంలో చీపురుపల్లి, రాజాం లో చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధం. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా
తోటపల్లి కెనాల్ ను పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే. తోటపల్లి కాలువకు సంబంధించి మిగిలిపోయిన 5 నుండి 7 శాతం పనులను ఎందుకు చేయలేకపోయారు. గడిగొడ్డ రిజర్వాయర్ సైతం వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయింది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
Ola Electric Car: అదిరిపోయే కార్.. లాంచ్ అప్పుడే!