Ola Electric Car: అదిరిపోయే కార్.. లాంచ్ అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలైతే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అటు.. ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తుండడంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా.. ఎలక్ట్రిక్ 4-వీలర్ ప్రొడక్షన్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తోంది.
జూన్ 19వ తేదీన ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించిన ‘ఓలా కస్టమర్ డే’ సందర్భంగా.. ఎలక్ట్రిక్ కారు గురించి వివరాలు ఇచ్చింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ సైతం ఈ కారు డిజైన్ మాక్-అప్స్ గురించి ట్వీట్ చేశారు. ఈ కారులో 70-80 kWh కెపాసిటీతో పెద్ద బ్యాటరీ ఉంటుంది. S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే.. ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి రేంజ్ ఇవ్వాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ధర విషయానికొస్తే.. ఈ ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హై డ్రైవింగ్ రేంజ్‌తో ఈ కారు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
అయితే.. ఈ సెడాన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికార సమాచారం లేదు కానీ, ఆగస్టు 15న ఈ కారు గురించి మరిన్ని వివరాల్ని కంపెనీ బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇది వచ్చే ఏడాదిలో మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సీఈఓ షేర్ చేసిన ఫోటోల్లో ఈ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. నాలుగు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, డోర్ హ్యాండిల్స్ లేని ఫినిషింగ్, బ్లాక్ కలర్ రూఫ్, కారు బాడీ చుట్టూ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!