ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.
విజయనగరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పై మండిపడ్డారు. బొత్సా వ్యాఖ్యల మీద స్పందిస్తే నా మీద ఎంపీ బెల్లాన స్పందించారు. ఆర్.ఈ.సి.ఎస్ లో అవినీతి జరిగిందని ఎంపీ బహిరంగంగా ఆరోపించారు. మరుసటి రోజు విజయవాడ వెళ్లి వచ్చిన తరవాత తమ వ్యాఖ్యల్లో మార్పు కనపడింది. వైసీపీ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు బొత్సా చేసిన అభివృద్ధి ఏంటి. తన పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు. మాజీమంత్రి…