పుట్టబోయే బిడ్డపై కూడా జగన్ అప్పు..! ఒక్కో ఫ్యామిలీపై రూ.2.50 లక్షల భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు అయ్యింది.. ప్రతీ ఫ్యామిలీపై అప్పుభారం పడుతోంది.. అన్నింటికీ వైఎస్ జగన్ సర్కార్ అప్పులు చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది ప్రతిపక్ష టీడీపీ.. అయితే, పుట్టబోయే బిడ్డపైనా కూడా వైఎస్ జగన్ అప్పు ఉందంటూ మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు.. రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లుగా గణాంకాలు చెప్పిన ఆయన.. ఈ లెక్కన ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం పడుతుందన్నారు.. సీఎం జగన్ రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు.
Read Also : ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్‌లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్‌పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
ఇక, వైఎస్ జగన్ దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పు పడుతోందని ఆరోపించారు కళా వెంకట్రావు.. అవినీతి, దుబారా కోసం ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో ప్రజానికంపై మోయలేని భారం వేస్తున్నారన్న ఆయన.. శిశువు జన్మించినప్పటి నుంచి వారి బాగోగుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ హయాంలో అమలు చేశామన్నారు.. మరోవైపు.. సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు తాగే టీ కి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్న టీడీపీ నేత.. చంద్రబాబు పాలనలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో రూ.5000కు చేరిందన్నారు. మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ముడుపులు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. 6 సార్లు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కళా వెంకట్రావు.
తాజావార్తలు
-
Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్‌కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
-
India Women History: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
-
ASUS Dawn 7S Ryzen Edition: 16GB RAM, Ryzen AI చిప్‌తో.. Asus Dawn 7S Ryzen Edition ల్యాప్‌టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
-
Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!