Supreme Court: జీవో నంబర్ 1.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు. రోడ్లు, రహదారులపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ.. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే..
Read Also: High Tension In Gollapudi: గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్ తరలింపు..!
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది… ఇక, తదుపరి విచారణ జనవరి 20కి తేదీకి వాయిదా వేసింది. కానీ, జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఈ జీవోను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ప్రాణాలు కాపాడడానికే జీవో జారీ చేశామని, ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేస్తున్నారు.. కానీ, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొంది. అయితే, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!