High Tension In Gollapudi: గొల్లపూడిలో ఉద్రిక్తత.. వివాదాస్పద స్థలం నుంచి టీడీపీ ఆఫీస్ తరలింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Tension In Gollapudi: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. గొల్లపూడిలోని వివాదస్పద స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయ తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు.. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.. కార్యాలయంలోని కంప్యూటర్లును కూడా తరలించారు పోలీసులు.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. టీడీపీ కార్యాలయంతో పాటు.. గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు టీడీపీ నేతలను కట్టడి చేస్తున్నారు.. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేశారు… ఇక, మొన్న రాత్రి నుంచి టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. అయితే, ఈ నెల 28వ తేదీలోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ నేత ఆలూరి చిన్నాకు స్థానిక తహసీల్దారు నోటీసులు ఇచ్చారు.. ఇంకా గడువు పూర్తి కాకముందే.. పోలీసులు చర్యలు చేపడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు.. వివాదస్పద స్థలాన్ని.. స్థల యజమానికి అప్పగించామని చెబుతున్నారు పోలీసులు.
Read Also: Fake Website: అచ్చం ప్రభుత్వ పోర్టల్‌లాగే నకిలీ వెబ్‌సైట్.. మోసగాళ్ల ముఠా అరెస్ట్
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఇక, స్థల యజమాని ఆలూరి శేషారత్నం మాట్లాడుతూ.. మా స్థలం వద్ద దేవినేని ఉమ అల్లరి చేయడం తగదన్నారు.. తల్లి కొడుకుల సమస్యలోకి దేవినేని ఉమ ఎందుకు తలదూరుస్తారు..? చంద్రబాబు.. ఉమకు ఇదే నేర్పించారా..? మేమేమైనా పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చామా..? అని ప్రశ్నించారు.. పార్టీ కార్యాలయానికి స్థలం రాసిచ్చేంత ఆస్తులు మాకు లేవని.. దేవినేని ఉమలాగా మేం ఆస్తులు సంపాదించుకోలేదని మండిపడ్డారు. తల్లికొడుకుల మధ్య ఉమ వచ్చి తగాదాలు పెడుతున్నారు.. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. నా కొడుకు చిన్నా మంచివాడే.. కానీ, నా కూతురుకేం లేకుండా చేస్తున్నారనేదే నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.. కలెక్టర్ ఆర్డర్ ఇస్తే ఉమకు ఏం ఇబ్బంది..? అని ఫైర్ అయిన శేషారత్నం.. దేవినేని ఉమ వల్లే మా కుంటుంబం ఇలా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నా ఇంటి ముందు ఉమ ధర్నా చేయడమేంటీ..? ఉమ ఇంటి ముందు నేను ధర్నా చేస్తే ఊరుకుంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!