జగన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆత్మకూరు లో ముందస్తు ప్రణాళికతో దాడి చేశారని, ప్రజా వ్యతిరేక విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎమ్మెల్యే శిల్ప, హఫీజ్ ఖాన్, డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ కుట్రదారులుగా ఆయన అభివర్ణించారు. ఆత్మకూరులో మసీదు నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకించారని, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మిస్తామంటే ఓర్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. స్థానికులు ఒప్పుకుంటేనే…