Srisailam Room Booking Scam: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. దేవస్థానానికి చెందిన ‘మల్లికార్జున సదన్’ వసతి గృహం పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి, గదుల కేటాయింపు పేరుతో భక్తుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు.
ఈ మోసపూరిత వెబ్సైట్ల బారిన పడి ఇప్పటికే పలువురు భక్తులు తీవ్రంగా నష్టపోయారు. కర్ణాటకకు చెందిన గురురాజ్ అనే భక్తుడు ఆన్లైన్లో వసతి కోసం వెతకగా, మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ కనిపించింది. దానిని అసలైనదిగా నమ్మిన ఆయన, డబ్బులు చెల్లించి రసీదు కూడా పొందారు. అయితే శ్రీశైలం చేరుకున్నాక, రిసెప్షన్లో ఆ రసీదు చూపించగా అది నకిలీదని సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆ భక్తుడు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
కేవలం ఇతర రాష్ట్రాల వారే కాకుండా, తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా ఈ కేటుగాళ్ల వలకు చిక్కుతున్నారు. విజయవాడకు చెందిన సాయి మల్లిక అనే భక్తురాలు వసతి గది కోసం ఈ వెబ్‌సైట్‌ను ఆశ్రయించి, అందులో ఉన్న రాజేష్ అనే వ్యక్తి నంబర్‌కు నగదు పంపారు. నగదు పంపిన తర్వాత బిల్లు కోసం ప్రయత్నించగా సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు ఆమె గ్రహించారు.
గతంలో కూడా ‘శ్రీశైలం టూరిజం’ పేరుతో ఇటువంటి నకిలీ వెబ్సైట్లు రావడంతో అధికారులు వాటిని క్లోజ్ చేయించారు. కానీ ఇప్పుడు మల్లికార్జున సదన్ పేరుతో మళ్లీ అదే తరహా మోసాలు జరుగుతున్నా, దేవస్థానం అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు మోసపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
భక్తులకు సూచనలు:
Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!