Deputy CM Pawan: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కార్తీక మాసంలోని ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట జరగడంతో తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను.. ఈ విషాదకర ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశాం.. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చారు.
Read Also: YS Jagan: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి..
ఇక, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నాను.. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.