Social Media Posts: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్..
- సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే..
- ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా..
- నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై..
- షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రత్న వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Posts: ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార కూటమి, ప్రతిపక్షం మధ్య.. సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.. అయితే, ఇది కొన్నిసార్లు శృతిమించిపోయి.. వ్యక్తిగత జీవితాలపై.. పోస్టుల వరకు వెళ్తోంది.. అయితే, దీనిపై సర్కార్ సీరియస్‌గా ఉంది.. ఇక, సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న..
Read Also: Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారంచేసిన, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఎస్పీ రత్న.. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరుపైన ఫోటోలు మార్ఫింగ్ చేసిన, మాన అభిమానాలు దెబ్బ తినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా మతపరమైన, సున్నిత అంశాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే.. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై సైబర్ సెల్ సోషల్ మీడియా విభాగం నందు ప్రత్యేక నిఘా ఉంచామని, సదరు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. అవాస్తవ ప్రచారాలను ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచామని, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ రత్న..
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!