Rottela Panduga: నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు..
- నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ..
- మొహరం సందర్భంగా జరిగే రొట్టెల పండుగ కోసం విస్తృత ఏర్పాట్లు..
- నేటి నుంచి నాలుగు ఐదు రోజులపాటు రొట్టుల పండుగ..
- దర్గా మిట్టలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు..
- దర్గా ప్రాంగణంలోని బారా షాహిద్ లను దర్శనం చేసుకొని..
- అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rottela Panduga: నెల్లూరు నగరంలో ప్రతి ఏటా మొహరం సందర్భంగా జరిగే రొట్టెల పండుగ కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి నాలుగు ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. దర్గా మిట్టలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలోని బారా షాహిద్ లను దర్శనం చేసుకొని.. అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకుని.. అది నెరవేరితే తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలడం సంప్రదాయంగా వస్తోంది.
Read Also: Chandrababu Meets Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ప్రధానంగా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె.. వివాహ రొట్టె.. విదేశీ రొట్టె.. ఉద్యోగ రొట్టె.. ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు.. భక్తుల రద్దీ అధికం కావడంతో రొట్టెల పండుగను ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ.. పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు.. భక్తులు ఉండేందుకు గుడారాలు.. స్నానపు గదులు.. మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.. సీసీ కెమెరాలతో భక్తుల కదిలికలను పర్యవేక్షించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు.. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు.
Read Also: Tummala Nageswara Rao : ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నాం
మరోవైపు.. నెల్లూరు చెరువులో బోటింగ్ కోసం పర్యాటక శాఖ ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ముందు జాగ్రత్తగా గజ ఈత గాళ్లను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. పండుగలో భాగంగా మొదటి రోజున సందల్ మాలీ.. రెండో రోజున గంధ మహోత్సవం నిర్వహిస్తారు. బారా షాహిద్ లకు గంధాన్ని లేపనం చేసిన తర్వాత ఆ గంధాన్ని భక్తులకు పంచి పెడతారు. మూడవ రోజున రొట్టెల పండుగ.. నాలుగో రోజు తహలీల్ ఫాతెహ.. ఐదో రోజున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు.. ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!